TSRTC | ఆర్టీసీకి అద్దె బస్సులు కావలెను.. ఉచిత ప్రయాణంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
TSRTC | ఆర్టీసీకి అర్జెంటుగా అద్దె బస్సు లు కావాలని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులు అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం ఆర్టీసీపై పడింది. మహాలక్ష్మీ పథకం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
TSRTC | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి అర్జెంటుగా అద్దె బస్సు లు కావాలని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులు అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం ఆర్టీసీపై పడింది. మహాలక్ష్మీ పథకం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత సర్వీసులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పలు ప్రాం తాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు అందుతుండగా, అద్దె బస్సులు తీసుకునేందుకు సంస్థ నిర్ణయించింది.
గ్రేటర్ పరిధిలో..
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, సిటీ మఫిసిల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆసక్తి ఉన్న వారు httpః//tsrtc.telangana.gov లేదా 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బస్సు నమూనా, కలర్, సీట్లు తదితర అంశాలతో యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

