Foxconn | ఫాక్స్‌కాన్ మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి.. కేటీఆర్ ట్వీట్
Foxconn | ఇప్పటికే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవ్వగా, మరో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది.
Foxconn | హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వందల కంపెనీలు పెట్టుబడి పెట్టి.. తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఇప్పటికే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవ్వగా, మరో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. గతంలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉందన్నారు. ఫాక్స్ కాన్ గ్రూపుతో తమ స్నేహం స్థిరంగా ఉందని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్లో రూ.1,656 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఫాక్స్ కాన్. ఈ నిర్మాణ పనులకు మే 15న కేటీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.
Our friendship with Foxconn Group remains steadfast, each of us delivering on mutual commitments
With total infusement of $550m (adding previous $150m), FIT is poised to deliver on its promises in Telangana
This once again proves Telangana Speed pic.twitter.com/DOssnhmyRo
— KTR (@KTRBRS) August 12, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Foxconn
- Minister KTR
- TSIPASS
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

