Foxconn | రంగారెడ్డి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్ పరిశ్రమ తయారీ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరగుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రశంసించారు. ‘దాదాపు నెల రోజుల క్రితమే కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. నిర్మాణ పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను.
ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు పేర్కొన్నట్టు ‘తెలంగాణ స్పీడ్’ను అతని బృందం కూడా బాగానే అనుసరిస్తున్నది’ అని మం త్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. పరిశ్రమ నిర్మాణ పనుల వీడియోను పోస్ట్‌చేశారు. ‘తెలంగాణ స్పీడ్’అంటూ ఫాక్స్‌కాన్ చైర్మన్ గతంలో చేసిన మాటలను మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రాజెక్ట్ చురుకైన పురోగతి అందుకుంటున్నదని, తెలంగాణ స్పీడ్ అన్న మాటలను యంగ్ లియూ బృందం బాగా అవలంబిస్తున్నదని కేటీఆర్ కితాబిచ్చారు.