T-Works | టీ వర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను : ఫాక్స్ కాన్ చైర్మన్
T-Works | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ వర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను అని ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. హైదరాబాద్( Hyderabad )తో పాటు తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది అని పేర్కొన్నారు.
T-Works | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ వర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను అని ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. టీ వర్క్స్ ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో యంగ్ లీయు మాట్లాడారు. హైదరాబాద్( Hyderabad )తో పాటు తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది అని పేర్కొన్నారు. ఇదే వేగంతో పని చేస్తే రాబోయే నాలుగేండ్లలో డబుల్ రెవెన్యూ సాధించడం ఖాయమన్నారు. ఈ ఏడేండ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో సీఎం కేసీఆర్ వివరించారు. టీ వర్క్స్‌కి ఎస్ఎంటీ యంత్రాన్ని త్వరలోనే అందిస్తాం అని ఫాక్స్ కాన్ చైర్మన్ తెలిపారు.
హైదరాబాద్ రాయదుర్గం ఐటీ కారిడార్‌లో 18 ఎకరాల్లో అత్యాధునియ సదుపాయాలతో టీ వర్క్స్‌ను నిర్మించారు. ఈ టీ-వర్క్స్‌ను ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించారు. మరో రూ.40 కోట్ల వరకు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే అవకాశం ఉంది. టీ-వర్క్స్ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉంది. ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్, ఇతర అంశాలపై టీ-వర్క్స్‌లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

