Road Accident | సూర్యాపేట, ఖమ్మంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది.
హైదరాబాద్: సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై కొందరు కూలీలు మొక్కలు కట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఘటనలో ఖమ్మంలో (Khammam) ఓ బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతులను మేడిపల్లికి చెందిన శివరామకృష్ణ, ఉదయ్‌కుమార్‌గా గుర్తించారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

