ఆదివాసీ బిడ్డవైతే అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చా?
ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా శాపనార్థాలు పెట్టడమెందుకు?’ అని మాజీ ఎంపీ మాలోతు కవిత ప్రశ్నించారు.
- సీఎం మెప్పుకోసమే సీతక్క ఆరాటం
- అందుకే కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు
- నీపై వచ్చిన ఆరోపణలకు జవాబివ్వు
- చిత్తశుద్ధి ఉంటే జీవో 49 రద్దుచేయించు
- సీతక్క రీల్స్మంత్రి.. రియల్మంత్రి కాదు
- మాజీ ఎంపీ మాలోతు కవిత విమర్శలు
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా శాపనార్థాలు పెట్టడమెందుకు?’ అని మాజీ ఎంపీ మాలోతు కవిత ప్రశ్నించారు. మంత్రి సీతక్కకు దమ్ముంటే తన అనుచరులు సాగించిన ఇసుక దందాపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీల ఇబ్బందులకు కారణమైన జీవో-49ని రద్దు చేయించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్పై, కేటీఆర్‌పై బురదజల్లితే సహించబోమని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మహిళా నాయకులు తుల ఉమ, సుమిత్రాఆనంద్, కీర్తిలత, పార్టీ నేత రాంచంద్రనాయక్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్‌పై ములుగులో సీతక్క చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం మెప్పుకోసమే కేటీఆర్‌పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్‌పై ఆరోపణలు చేసే ముం దు మావోయిస్టులు చేసిన ఆరోపణలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కి చేసిన ఫిర్యాదులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క.. రియ ల్ మంత్రి కాదు, రీల్స్ మంత్రి అని ఎద్దేవా చేశారు. ఆమెకు స్వాతిముత్యంలా నటించడమే తప్ప అభివృద్ధి చేయడం చేతగాదని మండిపడ్డారు. అక్రమా లు, అవినీతిని ప్రశ్నించిన వారిపై సీతక్క తన అనుచరులతో దాడులు చేయిస్తున్నదని, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై, జర్నలిస్టులపై దమనకాండకు దిగుతున్నదని దుయ్యబట్టారు. మారుమూలములుగును జిల్లాగా చేసిన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టించిన కేసీఆర్‌పై దూషణలకు దిగడం బాధాకరమని పేర్కొన్నారు.
అధికారమదంతో పిచ్చిమాటలు: తుల ఉమ
అధికారమదంతో మంత్రి సీతక్క కేటీఆర్‌పై పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. కేటీఆర్‌తో ఆమెకు ఏమన్నా గెట్టు పంచాయితీ ఉన్నదా? వ్యక్తిగత విమర్శలు చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఆదివాసీ బిడ్డ అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్టు మాట్లాడవచ్చా? అని నిలదీశారు. మహిళలకు ఇది చేశాం.. అది చేశాం అని చెప్పుకోవడం తప్ప ఉద్ధ్దరించిందేమీలేదని సుమిత్రా ఆనంద్ విమర్శించారు. ఇవ్వాళ ప్రెస్‌క్లబ్‌కు పిలిచిన కేటీఆర్.. రేపు కల్లు కాంపౌండ్‌కు పిలుస్తారంటూ వెటకారంగా మాట్లాడి జర్నలిస్టులను అవమానపరిచిన జగ్గారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

