విలువలు ఉంటే రాజీనామా చెయ్..
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.
- ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్ రెడ్డి సవాల్
- పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆనంద్ మాట్లాడుతూ రాజకీయ విలువల గురించే మాట్లాడే యాదయ్య ఇప్పు డు పార్టీ ఎందుకు వీడారో చెప్పాలని నిలదీశారు. నమ్ముకున్న కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కేసీఆర్ దయవల్లే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గతంలో యాదయ్య చెప్పారని గుర్తుచేశారు. చేవెళ్ల అభివృద్ధికి గతంలో కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని, 111 జీవో కూడా ఎత్తేశారని పేర్కొన్నారు. తన ఇంట్లో నాలుగు పదవులు అనుభవిస్తున్న యాదయ్య, బీఆర్ఎస్ క్యాడర్‌కు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే కే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పకన పెట్టి, బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేత పంజుగుల శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పాలనలో రాష్ట్రం ప్రమాదంలో పడిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

