KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్వల్పంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి తన నివాసంలో కాలు జారి కింద పడిపోయారు. దీంతో కేసీఆర్‌ను వెంటనే సోమాజీగూడలోని యశోధ దవాఖానకు తరలించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్వల్పంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి తన నివాసంలో కాలు జారి కింద పడిపోయారు. దీంతో కేసీఆర్‌ను వెంటనే సోమాజీగూడలోని యశోధ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన కాలు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హిప్ రీప్లేస్మెంట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వద్ద ఆయన సతీమణి శోభ, ఎంపీ సంతోశ్ కుమార్ ఉన్నారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేతను మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే కోలుకుంటారన్నారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- jagadish reddy
- KCR
- Mlc Kavitha
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

