కోర్టులో సొమ్మసిల్లిన మాజీ మంత్రి శంకర్రావు

- ఆరేండ్లనాటి కేసులో దోషిగా తేల్చిన ప్రజాప్రతినిధుల కోర్టు
నాంపల్లి క్రిమినల్ కోర్టు, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి శంకర్రావు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో బుధవారం సొమ్మసిల్లి పడిపోయారు. షాదనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరేండ్ల క్రితం శంకర్రావు ఓ భూ వివాదంలో జోక్యం చేసుకొని పలువురిని బెరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడి మహిళను బెదిరించారని కూడా ఆయనపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ బుధవారం తీర్పు చెప్పారు. శంకర్రావుకు మొదట కోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించింది. అయితే, న్యాయమూర్తి తీర్పు చదువుతున్న సమయంలో కోర్టు హాల్లోనే శంకర్రావు వీల్‌చైర్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శిక్షను రద్దుచేసి ఓ కేసులో రూ.2,000, మరో కేసులో రూ.1,500 జరిమానా విధించిది. మూడో కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేశారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. శంకర్రావు పై కోర్టులో అప్పీల్ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

