హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సాట్స్ మాజీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కుమారుడు రాజేశ్‌ను కాంగ్రెస్‌లోకి పంపి ఆయన బీఆర్ఎస్లో కొనసాగడం నైతికం అవుతుందా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ బీఆర్ఎస్లోనే కొనసాగాలనుకుంటే ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని శనివారం ఒక ప్రకటనలో సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే దామోదర్‌రెడ్డికి తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారని విమర్శించారు.