Harish Rao | దశ, దిశ లేని బడ్జెట్.. రాష్ర్టానికి ఇది తిరోగమనమే: హరీశ్‌రావు
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా ఆత్మస్తుతి, పరనిందగా ఉందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దశ దిశ లేకుండా ఉందని, ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ అని అభివర్ణించారు. ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాల ప్రస్తావనే లేదని, ఆరుగ్యారంటీలను పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు.
- అంతా ఆత్మస్తుతి, పరనింద..
- మహాలక్ష్మికి మహా నిరాశ.. ఆటో కార్మికులకు మొండి చేయి
- అప్పుల భారం.. భూముల విక్రయం.. రుణమాఫీకి నిధులేవి?
- ఆరు గ్యారెంటీల్లేవ్.. అంకెల గారడే
Harish Rao | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా ఆత్మస్తుతి, పరనిందగా ఉందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దశ దిశ లేకుండా ఉందని, ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపే బడ్జెట్ అని అభివర్ణించారు. ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాల ప్రస్తావనే లేదని, ఆరుగ్యారంటీలను పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని నిందించారని, భట్టి 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారని.. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినదానికంటే 17 వేల కోట్లు ఎకువ అని చెప్పారు. మహాలక్ష్మి పథకంపై బడ్జెట్ మహా నిరాశ కలిగించిందని, కోటి మంది మహిళలు నెలకు రూ. 2500 కోసం ఎదురుచూస్తున్నారని, ఎనిమిది నెలల్లో మహిళలకు రూ.20వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడ్డదని చెప్పారు. ఆసరా పింఛను రూ. 4 వేలు ఇస్తామని బాండు పేపర్ మీద రాశారని, మరి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, స్కూటీలు ఇస్తామన్నారని వాటి ప్రస్తావన ఏదని నిలదీశారు. కొత్త రేషన్ కార్డులు, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదని మండిపడ్డారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారని ఆవేదన వ్యక్తంచేశారు.
తాగుబోతుల తెలంగాణ చేస్తరా ?
గత బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయం 18,470 కోట్లు ఉంటే, భట్టి ప్రతిపాదించింది 25,617 కోట్లు. 7,147 కోట్లు ఎకువ పెంచుతామంటే తాగుబోతుల తెలంగాణ చేస్తారా ? బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పి, గల్లీకో బెల్ట్ షాప్ పెడతరా ?
– మాజీ మంత్రి హరీశ్‌రావు విజన్‌లేని సర్కార్
ప్రభుత్వానికి ఏ రంగంలోనూ విజన్ లేదని హరీశ్ రావు విమర్శించారు. దేశంలో తలసరి ఆదాయంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను తాము నంబర్ 1 స్థానంలో తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు అయితే, దేశ తలసరి ఆదాయం 1,83,236 మాత్రమేనని అన్నారు. రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయానికంటే రూ.1,64,063 ఎకువ అని, ఇది పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలన ఫలితమని తెలిపారు. దేశం జీడీపీ కంటే 2 శాతం ఎకువ ఉందని, తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతం కాగా దేశవృద్ధి రేటు 9.1 శాతమేనన్నారు. బడ్జెట్లో ఏదో చెప్పినంత మాత్రాన నిజాలు నిజం కాకుండా పోతాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు గ్యారెంటీల గారడీ.. నేడు అంకెల గారడీ
భట్టి విక్రమార్క బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశపర్చింది. బడ్జెట్లో ఆరు గ్యారెంటీలు నీరు కారిపోయాయి. సంక్షేమం సన్నగిల్లింది.. అభివృద్ధి అగమ్యగోచరమైంది. ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ, ఇప్పుడేమో అంకెల గారడీ.
– మాజీ మంత్రి హరీశ్‌రావు
రుణమాఫీకి 15వేల కోట్లే
పంద్రాగస్టు కల్లా ఏకకాలంలో రైతు రుణమాఫీ అని దేవుళ్ల మీద ఒట్టు పెట్టారని, రూ.31వేల కోట్లు మాఫీ అని చెప్పి బడ్జెట్లో రూ.15,470 కోట్లు మాత్రమే కేటాయించారని హరీశ్‌రావు విమర్శించారు. మైనారిటీలకు 4వేల కోట్లని మ్యానిఫెస్టోలో చెప్పి రూ. 3 వేల కోట్లే కేటాయించారని, ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల ఇస్తామని చెప్పి 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. ఇరిగేషన్‌కు రూ.22,301 కోట్లే కేటాయించారని చెప్పారు. దళితబంధు 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని ప్రస్తావన లేకుండా చేశారని విమర్శించారు. స్టాంపు డ్యూటీ ఆదాయాన్ని 18,228 కోట్లు ప్రతిపాదించారని, గతం కంటే 4 వేల కోట్ల ఎకువ వస్తాయని ప్రతిపాదించారని, భూముల విలువ, రిజిస్ట్రేషన్, పన్నుల భారం పెంచుతామని చెప్పకనే చెప్పారని మండిపడ్డారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ సాధ్యమా..?
గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయానికి వస్తే రూ.9729 కోట్లు గత సంవత్సరం వస్తే, నిన్ననే కేంద్రం నిధులు ఇవ్వలేదని తీర్మానం చేశారు. బడ్జెట్లో 21,636 కోట్లు పెట్టారని.. ఇంత ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రాజీనామాకు సిద్ధమా…?
ఒక డాక్టర్ పోస్టును భర్తీ చేయలేదని భట్టి ఆరోపించారు. మా హయంలో వైద్య ఆరోగ్య శాఖలో 30 వేల పోస్టులను భర్తీ చేశాం. భర్తీ చేసినట్టుగా నేను నిరూపిస్తా. నిరూపించకుంటే భట్టి రాజీనామాకు సిద్ధమా?
– మాజీ మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

