శ్రీరాం సాగర్ జలాశయానికి భారీగా వరద
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 788 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,073 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 31.849 టీఎంసీలు. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి 17.782 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భీంగల్ మండలం కప్పలవాగు చెక్‌డ్యామ్ పైనుంచి వర్షపు నీరు పారుతోంది. నవీపేట మండలం జన్నపల్లిలో పెద్ద చెరువు అలుగు పారుతోంది. లింగాపూర్ శివారులో వరద ధాటికి తుంగినిమాటు కాలువకు గండి పడింది. దీంతో వందల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. తీగలవాగు ఉప్పొంగడంతో ఏర్గట్ల – మెట్పల్లి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వర్షాల ఇబ్బందుల పరిష్కారానికి 08462 – 220183 నంబర్ కు ఫోన్ చేయొచ్చు. కామారెడ్డి జిల్లాలో సాధారణంతో పోలిస్తే 70 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

