తెలంగాణ చౌక్ (కరీంనగర్), నవంబర్ 13: సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతూ ఏపీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని దేశమంతా ముక్తకంఠంతో కోరుకొంటున్నారని చెప్పేందుకు ఈ ఫ్లెక్సీనే నిదర్శనం.
ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్ రావాలని, దేశ ప్రధానిగా కేసీఆర్ కావాలని కోరుతూ ఏపీలోని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గద్దె గోపాలకృష్ణమూర్తి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.