ఒకే మనిషికి ఐదు అవయవాల మార్పిడి
ఉస్మానియా జనరల్ దవాఖాన వైద్యులు దేశంలోనే తొలిసారిగా అత్యంత క్లిష్టమైన ‘మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్'ను విజయవంతంగా నిర్వహించారు.
- దేశంలోనే తొలిసారి చేపట్టిన ఉస్మానియా వైద్యులు
- 36 గంటలు సాగిన శస్త్రచికిత్స
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా జనరల్ దవాఖాన వైద్యులు దేశంలోనే తొలిసారిగా అత్యంత క్లిష్టమైన ‘మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ను విజయవంతంగా నిర్వహించారు. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ అవయవదాత నుంచి సేకరించిన ఐదు ప్రధాన జీర్ణాశయ అవయవాలను ఒకే రోగికి విజయవంతంగా మార్పిడీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 ఏండ్ల ఇంజినీర్ ‘ఫ్యామిలియల్ అడెనోమేటస్ పాలిపోసిస్ కోలి’ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు మొత్తం పెద్దపేగు (టోటల్ కోలెక్టమీ) తొలగించడంతోపాటు చిన్నపేగులో సుమారు 60 శాతం తొలగించారు.
దాంతో ఆయనకు షార్ట్ గట్ సిండ్రోమ్ ఏర్పడి, శరీరానికి అవసరమైన పోషకాలు అందక వేగంగా బరువు తగ్గుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఉస్మానియా దవాఖాన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు 36 గంటల పాటు ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ ప్రక్రియలో ఒకేసారి ఐదు కీలక అవయవాలను రోగికి అమర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

