రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం
Suryapet | సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమకాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటల సయంలో ట్రాక్టర్లో తిరుగుపయాణమయ్యారు. అయితే యూటర్న్ అయప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరం ఉండటంతో దూరాన్ని తగ్గించుకోవడానికి.. డ్రైవర్ ట్రాక్టర్ను హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్రూట్లో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయజవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను అంబులెన్సులు, అందుబాటులో ఉన్న వాహనాల్లో దవాఖానకు తరలించారు. తీవ్రగాయాలైనవారిని ఖమ్మం, సూర్యాపేటలోని హాస్పిటళ్లకు తరలించగా, స్వల్పంగా గాయపడినవారికి కోదాడ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతులను తన్నీరు ప్రమీల, చింతకాయల ప్రమీల, ఉదయ్ లోకేష్, నారగాని కోటయ్య, గండు జ్యోతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 38 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

