మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి..! ఆ ఐదు గ్రామాల తీర్మానం
హైదరాబాద్ : తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు. ఆ సమయంలో ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండేవి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలు, అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు.
వీటితో పాటు ఐదు గ్రామాలు సైతం ఏపీ పరిధిలోకి వెళ్లాయి. అయితే, గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి.. గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల గోదావరికి పెద్ద సంఖ్యలో వరదలు పోటెత్తాయి. భద్రాచలం పట్టణం ముంపునకు గురైంది. ఈ క్రమంలో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఏపీకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పట్టణానికి ముంపు లేకుండా ఉండేందుకు ఆయా గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలన్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల పంచాయతీలు తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేసి, ఏపీ ప్రభుత్వానికి పంపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

