Rythu Bandhu | తెల్లారేసరికి రైతుబంధు నిధులతో.. మోగిన రైతన్నల మొబైల్స్
రాష్ట్రంలో పదకొండో విడుత రైతుబంధు (Rythu Bandhu) పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు నిధులతో రైతన్నల మొబైల్స్ మోగిపోయాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగాణ (Telangana) సర్కార్ రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసి సంతోషాన్ని నింపింది.
హైదరాబాద్: రాష్ట్రంలో పదకొండో విడుత రైతుబంధు (Rythu Bandhu) పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు నిధులతో రైతన్నల మొబైల్స్ మోగిపోయాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగాణ (Telangana) సర్కార్ రైతుబంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసి సంతోషాన్ని నింపింది. రైతుబంధు నిధులు తమ ఖాతాల్లో జమ అయినట్లు వచ్చిన మెసేజ్లను చూసి రైతులు మురిసిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు (CM KCR) అన్నదాతలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు. పంటపొలాల్లో ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. రైతుల పాలిట దేవుడు కేసీఆర్ అని ప్రశంసిస్తున్నారు.
రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన నేడు గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ అయింది. వానాకాలం సాగుకు సంబంధించిన పంటసాయం ఈనెల 26 నుంచి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao), ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు (Ramakrishna rao) దానికి సంబంధిన ప్రక్రియను వేగవంతం చేసి సోమవారం ఉదయాన్నే రైతుల ఖాతాల్లో జమయ్యేట్లు చర్యలు తీసుకున్నారు.
ఈ సీజన్లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది. గతంతో పోల్చితే ఈ సీజన్లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు అందిస్తున్నది. రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్లో రైతుబంధు కోసం రూ.7,720.29 కోట్లు ఖర్చు చేయనుంది. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడుతున్నది. ఈ సీజన్తో కలిపితే రైతుబంధు ద్వారా రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమయినట్లవుతుంది. కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

