ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది?
- దవాఖానలపై అగ్నిమాపకశాఖ దృష్టి
- 23 హాస్పిటల్స్‌పై ఇప్పటికే చర్యలు
- గాంధీ, టిమ్స్ వద్ద ఫైరింజన్లు
- ఆర్ఎఫ్వో పాపయ్య వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 రోగులతో దవాఖానలు నిండుతున్న వేళ.. వాటిలో ఫైర్ సేఫ్టీ ఏస్థాయిలో ఉన్నదన్న అంశంపై అగ్నిమాపకశాఖ అధికారులు దృష్టిసారించారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్, 1999 ప్రకారం 15 మీటర్ల ఎత్తుకు మించి ఉన్న దవాఖానల భవనాలు అగ్నిమాపకశాఖ నుంచి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తప్పక తీసుకోవాలి. వీటి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దవాఖానల భవనాలను పరిశీలిస్తున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ రీజియన్ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య తెలిపారు. మొత్తం 112 హాస్పిటల్ భవనాలకు ఎన్వోసీలు ఇచ్చినట్టు తెలిపారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన 23 దవాఖానలపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. వీటిలో 18 హాస్పిటల్ భవనాలను ఆకస్మిక తనిఖీల్లో గుర్తించగా, మరో ఐదు దవాఖానలకు సాధారణ ప్రక్రియలో భాగంగా గుర్తించినట్టు వెల్లడించారు. మొత్తం 23 భవనాల్లో నాలుగు దవాఖానలకు ఇప్పటికే కోర్టులు జరిమానాలు విధించాయని, మరో 19 భవనాలకు సంబంధించిన కేసులు ట్రయల్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. కొవిడ్-19 దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లను తరచూ తనిఖీలు చేస్తున్నామని, అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అగ్నిప్రమాదాలు జరగకుండా పాటించాల్సిన నియమాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై ఈ నెల 20న అన్ని హాస్పిటల్స్ నిర్వాహకులకు, సెక్యురిటీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. గాంధీ దవాఖాన, టిమ్స్ వద్ద నిరంతరం ఫైర్ ఇంజిన్లను అప్రమత్తంగా ఉంచుతున్నట్టు తెలిపారు. దవాఖాన భవనాల్లో మంటలు చెలరేగినా, పొగ వ్యాపించినా ప్రజలు వెంటనే 101 లేదా 99499 91101కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- fire station
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

