మావోయిస్టు గడ్డం మధుకర్ అంత్యక్రియలు పూర్తి
కరోనా | కరోనా బారిన పడి మృతి చెందిన మావోయిస్టు గడ్డం మధుకర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కొండపల్లిలో(ఆసిఫాబాద్ జిల్లా) సోమవారం ముగిశాయి.

కుమ్రం భీం ఆసిఫాబాద్ : కరోనా బారిన పడి మృతి చెందిన మావోయిస్టు గడ్డం మధుకర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కొండపల్లిలో(ఆసిఫాబాద్ జిల్లా) సోమవారం ముగిశాయి. గ్రామస్తులు మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. మధుకర్ అంత్యక్రియల ఖర్చు నిమిత్తం సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కొనేరు కోనప్ప రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. మధుకర్ అంత్యక్రియల నేపథ్యంలో కొండపల్లి గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరోనా బారినపడిన మధుకర్ చికిత్స కోసం ఈ నెల 2న వరంగల్‌కు వచ్చి అక్కడి పోలీసులకు చిక్కాడు. దీంతో ఆయనను పోలీసులు హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానలో చేర్చి చికిత్స అందించారు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై మధుకర్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్‌లో చేరారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

