హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జ్యాబ్ క్యాలెండర్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. నిరుద్యోగుల పోరాటాలకు పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ సోమవారం ఇందిరాపారు ధర్నా చౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.