పోరాటయోధుడు దాశరథి : సీఎం రేవంత్‌రెడ్డి
నా తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. సోమవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : నా తెలంగాణ కోటి రతణాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. సోమవారం దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో పండితుడైన దాశరథి తన కలం నుంచి ఓ వైపు విప్లవాగ్నిని రగల్చుతూనే, మరోవైపు అనువాద, ప్రణయ కవిత్వాలు, సినీ గీతాలను వెలువరించిన సవ్యసాచి అని పేరొన్నారు. దాశరథి పోరాటపటిమ మలిదశ తెలంగాణ ఉద్యమపోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు.
డిమోటెడ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
- డిప్యూటీ సీఎంకు కూనంనేని లేఖ
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : టీజీ జెన్కో, ట్రాన్స్‌కోలో రెవెన్షన్, డిమోటెడ్ పొందిన విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. జెన్కో, ట్రాన్స్‌కోలో కొంత మంది ఉద్యోగులను అన్యాయంగా డిమోట్, రెవెన్షన్ చేశారని, ఆ విషయాన్ని పరిశీలించి తిరిగి యధాస్థానంలో నియమించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

