Tahasildar Bribe | రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా తహసీల్దార్
Tahasildar Bribe | మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.
మేడ్చల్ : రాష్ట్రంలో మరో అవినీతి అధికారిణి ఏసీబీ ( ACB )అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం ఇద్దరు, మంగళవారం మరో ఇద్దరు అధికారులకు చిక్కడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ ( Female Tahsildar) టి.సుచరిత ( Sucharitha ) రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.
ఈ కేసులో ఆమె డ్రైవర్ వి నాగేష్‌ను కూడా అరెస్టు చేశారు. 30 ఎకరాల వ్యవసాయ భూమిలో నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తును ఆమోదించాలని తహసీల్దార్‌ను కోరగా అందుకు రూ.30లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం మధ్యాహ్నం కార్యాలయంలో తహసీల్దార్ ప్రైవేట్ డ్రైవర్ నాగేష్కు రూ.2లక్షలు అందజేశాడు.
డ్రైవర్ ఆ డబ్బును తహసీల్దార్ సుచరితకు ఇస్తుండగానే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం డబ్బును పట్టుకున్నారు. ఆమెతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

