FCRI | హైదరాబాద్ : అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్)లో ప్రవేశాలను నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలను కల్పించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 14వ తేదీ నుంచి జులై 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ. 1000, ఇతరులు రూ. 2000 చెల్లించాలి. ఆలస్య రుసుం రూ. 500 చెల్లించి జులై 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం www,fcrits.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.