మద్యం మత్తులో తండ్రి.. కొట్టిచంపిన తనయుడు
తండ్రిని చంపిన తనయుడు | నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని.. సొంత కుమారుడే కొట్టి చంపాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలో

నాగర్‌కర్నూల్ : నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని.. సొంత కుమారుడే కొట్టి చంపాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోడేళ్ల కురుమయ్య (48) అనే వ్యక్తి నిత్యం మద్యం సేవిస్తూ భార్యను, పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా పీకల దాకా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో కురుమయ్య గొడవ పడ్డాడు.
తండ్రి ఆగడాలను భరించలేక.. సహనం కోల్పోయిన కుమారుడు మద్దిలేటి ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. దీంతో కురుమయ్య ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మద్దిలేని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

