TSPSC | టీఎస్పీఎస్సీ కేసులో తండ్రీకూతురి రిమాండ్
TSPSC | టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్, ఆయన కూతురు సాహితిని సిట్ అధికారులు బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య వారిద్దరికీ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖరరెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది.
TSPSC | నాంపల్లి కోర్టులు/ హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్, ఆయన కూతురు సాహితిని సిట్ అధికారులు బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య వారిద్దరికీ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖరరెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది.
బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న మూడో పిటిషన్‌ను 4వ అదనపు సెషన్స్ కోర్టు ఇంచార్జి జడ్జి భూపతి డిస్మిస్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ మహబూబ్ బెయిల్ పిటిషన్‌ను జిల్లా జడ్జి కొట్టివేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో కళాశాల డైరెక్టర్ రోకొండ్ల వేంకటేశ్వర్లు, బసవవేణి శివకుమార్, బిర్రు నాగరాజును ఐదు రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.
సిట్ అదుపులో ఆరుగురు అనుమానితులు
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ తాజాగా ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నది. వీరికి మాజీ ఏఈ పోల రమేశ్‌తో సంబంధమున్నట్టు వెలుగులోకి రావడమే ఇందుకు కారణం. ఏఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్ నిర్వహించిన రమేశ్.. ఆ తరువాత ఏఈ పరీక్ష పత్రాన్ని పలువురికి విక్రయించాడు. దీంతో రమేశ్ నుంచి ఆ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినవారు, మాస్ కాపీయింగ్‌కు పాల్పడినవారితోపాటు ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినవారు, ఆర్ధిక సహకారం అందించినవారి కోసం జల్లెడ పడుతున్న సిట్.. తాజాగా ఈ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

