Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
జహీరాబాద్ పూల మార్కెట్ ప్రస్తుతం పండుగలతో కళకళలాడుతోంది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వరుసగా రావడంతో పూలకు(Flowers) ఎప్పుడూ లేనంత డిమాండ్ ఏర్పడింది.
జహీరాబాద్, అక్టోబర్ 15 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పూల మార్కెట్ ప్రస్తుతం పండుగలతో కళకళలాడుతోంది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వరుసగా రావడంతో పూలకు(Flowers) ఎప్పుడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. దీంతో పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరు నెలలు కష్టపడి పండించిన పూల రైతులకు ఇప్పుడు కాసుల పంట పండుతోంది.
బంతి పూలకే ఎక్కువ గిరాకీ..
బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ. బతుకమ్మను పేర్చడానికి ప్రధానంగా బంతి పూలు, గునుగు పూలు, తంగేడు పూలు వాడతారు. ఇందులో బంతి పూలకు అధిక డిమాండ్ ఉంది. పసుపు, ఎరుపు రంగు బంతి పూలు లేనిదే బతుకమ్మ అందంగా కనిపించదు. అందుకే ప్రతి మహిళ బంతి పూల కోసం మార్కెట్ కు వస్తోంది. సాధారణ రోజుల్లో కిలో రూ.20 నుంచి రూ.30 కి అమ్మే బంతి పూలు.. ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. ఉదయం మార్కెట్ కు వచ్చిన పూలు మధ్యాహ్నానికే అమ్ముడైపోతున్నాయి.
చామంతి, గులాబీకి పోటీ..
దసరా, దీపావళి పండుగలకు చామంతి, గులాబీ పూలకు ఎక్కువ డిమాండ్ ఉంది. దేవాలయాల అలంకరణకు, ఇళ్లలో దేవుడి పూజకు, మాలలు కట్టడానికి చామంతి పూలను ఎక్కువగా వాడతారు. గులాబీ పూలను దండలు, బొకేలకు వాడతారు. ప్రస్తుతం మార్కెట్లో చామంతి పూలు కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. తెల్ల చామంతి పూలకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో రూ.160 వరకు పలుకుతోంది. ఇక గులాబీ పూలు కిలో రూ.200 పలుకుతున్నాయి. ఎర్ర గులాబీకి మరింత ధర ఉంది.
మార్కెట్లో రద్దీ..
జహీరాబాద్ పూల మార్కెట్లో ఉదయం 4 గంటల నుంచే వ్యాపారం మొదలవుతోంది. న్యాల్కల్, కోహిర్, ఝరాసంగం మండలాల నుంచి రైతులు పూల బుట్టలతో మార్కెట్ కు వస్తున్నారు. ఆడబిడ్డలు బతుకమ్మల కోసం, వ్యాపారులు దుకాణాల అలంకరణ కోసం పూలను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు చెబుతున్న ప్రకారం.. మరో పది రోజుల పాటు పూలకు ఇదే డిమాండ్ ఉంటుంది. బతుకమ్మ పండుగ ముగిసినా.. దీపావళి వరకు చామంతి, గులాబీ పూలకు గిరాకీ తగ్గదని అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

