Paddy Procurement | మా ధాన్యం కొనేదెప్పుడు?.. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరగడం లేదంటూ నిరసన చేపట్టారు.
Paddy Procurement | మల్హర్, జూన్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరగడం లేదంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తేమ ఉన్నదని, లారీలు రావడం లేదనే కారణాలతో వడ్లు కొంటలేరని ఆరోపించారు. ఇప్పటికే వర్షాలతో మూడు, నాలుగుసార్లు ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వాహకులు బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని అన్నారు. ఓ వైపు వర్షం వస్తుందేమోనని రోజూ భయపడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. కేంద్రం నిర్వాహకుడే దళారిగా మారి క్వింటాల్‌కు రూ.1,900 చొప్పున కొనుగోలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వ గిట్టుబాటు ధర రూ.2,200 ఉండగా, రూ.1,800 నుంచి రూ.1,900కు అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నామని, మరికొందరు ఇప్పటికే అమ్ముకున్నారని చెబుతున్నారు. ఈ నిరసనలో రైతులు తోట సమ్మక విమల, రమ, రమక, నీలమ్మ, తిరుపతి, సమ్మయ్య, చంద్రయ్య, రాజసమ్మయ్య, బుచ్చన్న, రవీందర్ పాల్గొన్నారు.
నెల రోజులైనా నా వడ్లు కొనలే..
నేను 200 ధాన్యం బస్తాలను నెల రోజుల కిందట కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన. నిర్వాహకులు ధాన్యం వైపు కన్నెత్తి కూడా చూడలే. దీంతో బయట ప్రైవేటు వ్యక్తులకు క్వింటాల్‌కు రూ.1,800 చొప్పున అమ్ముకున్న. కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు.
– బత్తుల వెంకటరాజం, రైతు, ఎడ్లపల్లి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

