కోర్టు భవనం పైనుంచి దూకిన కుటుంబం
మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు
- భార్య మృతి, భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు
- మెదక్ జిల్లా కేంద్రంలో ఘటన
మెదక్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర ఘటన శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రాథమిక వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన రమ్య, నవీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. గతంలో కుటుంబ కలహాలతో రమ్య, నవీన్ మధ్య గొడవ జరిగింది.
రమ్య తల్లిగారి ఇంటిని తగలబెట్టిన కేసులో నవీన్ నిందితుడు. ఈ కేసులో నవీన్ బైకు, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఈ విషయంలో మెదక్ జిల్లా కోర్టుకు శనివారం చేరుకున్న నవీన్, రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలో గొడవపడ్డారు. మూడో అంతస్థుకు చేరుకొని కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మరణించింది. భర్త నవీన్‌కు తీవ్రగాయాలు కావడంతో జిల్లా కేంద్ర దవాఖానలో చేర్పించారు. ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రగాయాలు కావడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని జడ్జితోపాటు డీఎస్పీ, సీఐ పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

