హలో.. పనైపోతుంది! డబ్బు పంపండి!
‘హలో.. నేను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉద్యోగిని. మీరు డీమ్డ్ వర్సిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా? ఉన్నత విద్యామండలి చైర్మన్ నాకు చాలా దగ్గర. ఆయనకు నేనెంత చెబితే అంత. మీ పని త్వరగా చేయించే పూచీ నాది.
- ఉన్నత విద్యామండలి పేరిట నకిలీ ఉద్యోగి ఫోన్లు
- మండలి అధికారుల ఫిర్యాదు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ‘హలో.. నేను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉద్యోగిని. మీరు డీమ్డ్ వర్సిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా? ఉన్నత విద్యామండలి చైర్మన్ నాకు చాలా దగ్గర. ఆయనకు నేనెంత చెబితే అంత. మీ పని త్వరగా చేయించే పూచీ నాది. బ్యాంక్ అకౌంట్ నంబర్ పంపిస్తున్నా. అమౌంట్ పం పించండి’ అంటూ ప్రముఖ కాలేజీలకు ఫోన్లు చేస్తూ వసూళ్ల దందాకు తెరలేపాడో నకిలీ ఉద్యోగి. ఏకంగా పలు కాలేజీలకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. సోమవారం ఒక్కరోజే రెండు కాలేజీలకు ఫోన్లు వెళ్లాయి. కాలేజీ యజమానులు ఉన్నత విద్యామండలిలో ఆరా తీయడంతో నకిలీ వ్యక్తి చేసిన బాగోతమని తేలింది.
అప్రమత్తమైన మండలి వర్గాలు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రూకాలర్‌లో వ్యక్తి మొబై ల్ నంబర్‌పై తెలంగాణ ఉన్నత విద్యామండలి అని ఉండటం, లోగోను కూడా వాడటం గమనార్హం. ఇదే వ్యక్తి మరో కాలేజీకి ఫోన్ చేసి ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి, తక్షణమే కట్టాలని సూచించడంతో వారు కూడా మండలి అధికారులను ఆరా తీశారు. ‘లా కాలేజీకి అనుమతులు కావాలంటూ సదరు వ్యక్తికి ఫోన్‌చేయగా, ఆ సెక్షన్ తన పరిధిలోకి రాదని నకిలీ వ్యక్తి చెప్పడం గమనార్హం. అధికారుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేసేవారిని నమ్మవద్దని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సూచించారు. మండలి పేరును వాడుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

