Fake cotton seeds | రూ.కోటి 80లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం..ముగ్గురు అరెస్ట్
Fake cotton seeds | నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను(Fake cotton seeds) స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను(Fake cotton seeds) స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు వివరాలను వెల్లడించారు. అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు నల్లగొండ నార్కట్‌పల్లి పోలీసులు(Narkat Police), వ్యవసాయశాఖ అధికారులు, టాస్క్ఫోర్సు సిబ్బంది బుధవారం ఉదయం 5 గంటలకు నార్కట్ పల్లి ఫ్లై ఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు.
అనుమానస్పదంగా వస్తున్న ఎర్టిగా కారును తనిఖీ తనిఖీ చేయగా అందులో రెండు బస్తాలలో విడి విత్తనాలు ఉండడాన్ని గమనించారు. అవి నకిలీ పత్తి విత్తనాలుగా తేలడంతో కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కర్ణాటక లో కొంత మంది రైతుల దగ్గర నుంచి నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లా దాచపల్లి దగ్గర స్టోరేజ్ చేశారని ఎస్పీ తెలిపారు. అక్కడి నుంచి మహారాష్ట్ర(Maharastra)లోని నాగపూర్‌కు తరలిస్తుండగా నార్కట్ పల్లి వద్ద పట్టుకున్నామన్నారు.

సికింద్రాబాద్‌లోని అల్వాల్ హిల్స్‌కు చెందిన వ్యాపారి గోరంట్ల నాగార్జున, ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లాకు చెందిన మెరిగే వేణును అరెస్టు చేసినట్లు వివరించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన నరసింహఅనే వ్యక్తి పరారీలో ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. రైతులను మోసం చేసే వారిపై చర్యలకు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్‌ను పెడతామని ఆమె హెచ్చరించారు.
ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ డీఎస్పీ నరసింహ రెడ్డి, చిట్యాల సీఐ శివ రామ్ రెడ్డి, నార్కెట్ పల్లి ఎస్ఐ సైదా బాబు, చిట్యాల ఎస్ఐ రవి, ఎసై విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్స్ శివ శంకర్,గిరిబాబు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

