KCR Speech | కేసీఆర్ స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ..
KCR Speech | బీఆర్ఎస్ రజతోత్సవ సభపై యావత్ తెలంగాణ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు పదేండ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను నెమరువేసుకుంటున్నది.
- సోషల్ మీడియాలోనూ దీనిపైనే టాక్
- బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం
KCR Speech | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభపై యావత్ తెలంగాణ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు పదేండ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను నెమరువేసుకుంటున్నది. సబ్బండవర్గాల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతున్నది. సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు? ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? అన్న చర్చ జోరుగా జరుగుతున్నది. సోషల్ మీడియాతోపాటు బయట ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. అనాలోచిత నిర్ణయాలతో, అసమర్థ పాలనతో ప్రజలను గోసపుచ్చుకుంటున్నది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నది. కొత్త పథకాల సంగతేమో కానీ, ఉన్న పథకాలకు కూడా నిధులు విదల్చడం లేదు. మరీ ముఖ్యంగా తొమ్మిదిన్నరేండ్ల పాటు కుషాల్గా బతికిన రైతన్నకు నేడు కంటిమీద కునుకులేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, రేవంత్‌రెడ్డిపైనా సబ్బండ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సుదీర్ఘ విరామం తరువాత బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనుండటం కూడా ఉత్కంఠకు కారణమైంది. సార్ ఏం మాట్లాడుతారు? ఏ అంశాలను ప్రస్తావిస్తారు? అని రైతులు, ఆటో కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, రేవంత్ పాలనా వైఫల్యాలను చీల్చి చెండాడటం ఖాయమని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో మరో విధమైన ఉత్సాహం నెలకొన్నది. ప్రతి ఒక్కరిలో ఉద్యమం నాటి స్ఫూర్తి కనిపిస్తున్నది. పార్టీ ఏర్పాటు నుంచి ఉద్యమకాలం నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

