DDMS | డీడీఎంఎస్‌లో వివిధ వొకేషనల్ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు
DDMS | దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో వివిధ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
DDMS | ఉస్మానియా యూనివర్సిటీ : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో వివిధ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్‌కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్స్), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ అసిస్టెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత పదవతరగతి అని వివరించారు. రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ అసిస్టెంట్, క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్, పర్ఫ్యుజన్ టెక్నీషియన్ వంటి పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత ఇంటర్మీడియట్ అని చెప్పారు. అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 8309037134, 6305895867 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

