హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంయుక్త తనిఖీల్లో రూ.1.60 కోట్ల విలువైన నిషేధిత సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాశ్ మొహంతి ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ డీ-టీమ్ డీఎస్పీ తిరుపతి యాదవ్, సీఐ నాగరాజు, డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు ఇందిరా ప్రియదర్శిని, అన్వేష్ మంగళవారం నాచారంలోని హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రేడింగ్ షాపులో తనిఖీలు నిర్వహించి 5.860 కిలోల ఎన్-బెంజైల్పైపెరాజైన్ డ్రగ్‌ను సీజ్ చేశారు.
ఆ సంస్థ గుజరాత్ నుంచి ఈ డ్రగ్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ముంబైకి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముదిగొండ ఈశ్వర్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.