ఇల్లిల్లూ తిరుగుతూ!

- జ్వర సర్వే చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
- లక్షణాలుంటే వెంటనే ఐసొలేషన్ కిట్
- కొవిడ్‌ను ఎదుర్కొనేందుకే సర్వే
- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- వారంలో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం
- ప్రతి రోజు లక్షకుపైగా నిర్ధారణ పరీక్షలు
- సర్వే పరిశీలనలో సీఎస్ సోమేశ్‌కుమార్
నమస్తే తెలంగాణ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జ్వర సర్వే ప్రారంభమైంది. థర్డ్‌వేవ్ నేపథ్యంలో కరోనా నుంచి ప్రజలను కాపాడుకొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించటంతో వైరస్ వ్యాప్తిని ప్రాథమిక స్థాయిలోనే కట్టడి చేసేందుకు ఇంటింటికీ సర్వే చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం తెలిపారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సిబ్బందితోపాటు పంచాయతీరాజ్, పురపాలక శాఖల సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సర్వే చేశారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉన్నవారికి అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్ అందజేసి, వివరాలను నమోదు చేసుకొన్నారు. లక్షణాలు లేనివారికి కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
జ్వర సర్వేలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఏనుగొండలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జ్వర సర్వేలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరం, దగ్గు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే చేపట్టినట్టు తెలిపారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సిబ్బంది 1,89,319 ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారని వెల్లడించారు. జిల్లాలో 40 వేల ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.
కోటికి పైగా మెడికల్ కిట్లు సిద్ధం: సీఎస్
ఖైరతాబాద్‌లోని హిల్‌టాప్ కాలనీలో జ్వర సర్వే తీరును సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారంలో సర్వేను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. ఒమిక్రాన్‌తో ఆందోళనపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనటానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉన్నదని తెలిపారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో ఫీవర్ సర్వే ప్రారంభమైందని, ఒక్కో బృందంలో ఆశా, ఏఎన్ఎం, మున్సిపల్, పంచాయతీశాఖల సిబ్బంది ఉన్నారని, వారంతా ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో దాదాపు 56 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అటు.. వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నదని సీఎస్ చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. (తొలిరోజు)
జ్వర సర్వేలో పాల్గొన్న బృందాలు 16,807
సర్వే చేసిన ఇండ్లు 6,10,919
లక్షణాలున్నవారు/ అందజేసిన కిట్లు 18,411
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

