Jagadish Reddy | ప్రాజెక్టుల్లో నీటి నిల్వపై కేబినెట్ సబ్ కమిటీ విచిత్రం : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
Jagadish Reddy | రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మరిచినట్లు కనబడుతుందన్నారు.
Jagadish Reddy | రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మరిచినట్లు కనబడుతుందన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్ల నీటి నిల్వపై కేబినెట్ వేయడం విచిత్రంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటి పని కోసం సబ్ కమిటీ ఎక్కడా లేదన్నారు. ప్రొజెక్టుల ప్రోటోకాల్ ముందే నిర్ణయం చేసి ఉంటుందన్నారు. రేషన్ కార్డుల అర్హుల నిర్ణయానికి సబ్ కమిటీ అనాలోచిత నిర్ణయమని.. తప్పించుకునేందుకు కాంగ్రెస్ దొంగబుద్ధి ప్రదర్శిస్తుందని విమర్శించారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం పంప్‌హౌస్ నుంచి పంపింగ్ చేసి సాగునీరు అందించాలన్నారు. ఎగువ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకున్నా పంపింగ్ పంపింగ్ జరుపడం లేదని.. సుమారు 140 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని.. సోయి, అవగాహన లేక నీటిని ఎత్తిపోయడం లేదన్నారు. ఎస్సారెస్పీ ఫేస్-2కి ఎందుకు నీళ్లు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రయోజనాలు పొందడంలేదన్నారు. లక్షల క్యూసెక్కుల నీటినంతా కాంగ్రెస్ సముద్రం పాలు చేస్తుందన్నారు. వరద పోయాక హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదని.. ఒక్క ఒకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. హెలికాఫ్టర్లలో విహారయాత్రలు మాని ప్రొజెక్టుల పర్యటనలు చేయాలని హితవు పలికారు.
ప్రాజెక్టుల్లో గ్రౌటింగ్ సర్వసాధారణ ప్రక్రియని.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగిలో పొలాలు ఎండినట్లు ఇప్పుడు ఖరీఫ్‌లోనే ఎండిపోయే పరిస్థితి కనపడుతుందన్నారు. ఎన్డీఎస్ఏకి నివేదికలు పంపి.. అనుమతులు తీసుకోవాలని.. వర్షాలు ఆగి వరద రాకపోతే తెలంగాణ రైతుల ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఎత్తిపోతల ప్రారంభించాలని.. రివ్యూ చేసి ఎత్తిపోతలు మొదలుపెట్టకపోతే రైతులకు ద్రోహం చేసినట్టేనన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం జీవో33తో నష్టం జరుగుతుందన్నారు. నేటివిటీ నిర్భయం గుడ్డిగా చేసినట్లుందన్నారు. నష్టపోయిన వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. జీవోపై న్యాయ పోరాటానికి సైతం వెనుకాడమన్నారు. పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడిందని.. పాత విధానాన్నే కొనసాగించాలని.. పాత బాసులను సంతృప్తి పరిచేందుకే రేవంత్ చేస్తున్న ప్రయత్నం ఇదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

