Ex Minister Jagadish Reddy | సాగర్‌ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి : జగదీశ్‌రెడ్డి
Ex Minister Jagadish Reddy | నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడ్లో రోడ్‌షో నిర్వహించారు.
Ex Minister Jagadish Reddy | నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడ్లో రోడ్‌షో నిర్వహించారు. జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగర్ ప్రాజెక్టులో నీళ్లున్నా.. కాంగ్రెస్ నాయకుల అలసత్వం, ఉదాసీనత వైఖరితో ఆయకట్టు అంతా సర్వనాశనమైందని ఆరోపించారు.
సాగర్‌లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకు తలాతోక తెలియదని.. ఎందుకు గెలిపించారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లు అందించామన్నారు. ఒక్క ఎకరం కూడా ఎండనివ్వలేదన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్రపోతూ.. రైతులను ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఈ ప్రచారంలో అభ్యర్థి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భగత్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

