కోర్టుకు టీఎస్పీఎస్సీ నిందితుల సాక్ష్యాధారాలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను సిట్ శనివారం కోర్టుకు సమర్పించింది. ఫోన్లు, బ్యాంక్ లావాదే వీలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర వస్తువులన్నింటినీ కోర్టుకు జమ చేసింది.
నాంపల్లి కోర్టులు, జూన్ 24 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను సిట్ శనివారం కోర్టుకు సమర్పించింది. ఫోన్లు, బ్యాంక్ లావాదే వీలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర వస్తువులన్నింటినీ కోర్టుకు జమ చేసింది. ప్రధాన నిందితులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డితో పాటు 37 మంది నిందితుల నుంచి సేకరించిన కీలక ఆధారాలను సిట్ అధికారులు కోర్టుకు అందజేశారు. కేసు విచారణకు కావాల్సిన ఆధారాలను, నిందితులకు ఇవ్వాల్సిన చార్జిషీట్ కాపీలను కూడా జతపర్చారు. 90 రోజుల ముందే సిట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడంతో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి బెయిల్ మంజూరు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకూ వీరి తరఫున కోర్టుకు బెయిల్ పిటిషన్లు దాఖలు కాలేదు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సయ్యద్ మహబూబ్‌ను 7 రోజులు సిట్ కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. దీంతో నిందితుడి తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారానికి మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

