అందరూ మట్టి గణపతులనే పూజించాలి : మంత్రులు ఐకే రెడ్డి, తలసాని
హైదరాబాద్, ఆగస్టు 27: పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి మంత్రులు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తుందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్ తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతున్నది. కావున వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామన్నారు.
అంతకుముందు మంత్రులు వినాయక స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి డాలర్ లాకెట్ ను ఆవిష్కరించారు. కొబ్బరి లడ్డు ప్రసాద విక్రయ సేవలను కూడా మంత్రులు ప్రారంభించారు.
కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో వినోద్ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

