మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి | భావితరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించాలంటే మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ : భావితరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించాలంటే మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. కరోనా నేపథ్యంలో ముందే ప్రకటించిన విధంగా జన్మదిన వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపాలని అనుకున్న వారు మొక్క నాటితే చాలని ఆయన ఇచ్చిన పిలుపునకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ స్పందన లభించింది. అందులో భాగంగా రాష్ట్ర ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కో సబ్ స్టేషన్లో సంఘం ఆధ్వర్యంలో 56 మొక్కలు నాటి వినూత్న రీతిలో మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉదయం సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి జగదీష్ రెడ్డి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అభిమానులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..
విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, 1104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి 56వ జన్నదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో 56 మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్ఈ కార్యాలయంలోనూ ఉద్యోగ సంఘాల నాయకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ,కార్యదర్శులు శివకుమార్, ఎంఏ మాజిద్, విద్యుత్ శాఖ ఏడీ శంకరయ్య 1104, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి నాయకులు పర్వతాలు, మల్లేష్, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

