బీజేపీలో గ్రూపు రాజకీయాలు
- బండి సంజయ్‌కి పోటీగా ఈటల టూర్లు
- సొంతంగా జిల్లాల్లో వరుస పర్యటనలు
వరంగల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమలం పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో ఎవరికి వారుగా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొన్నది. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పోటీగా ఆ పార్టీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్ రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. బండి సంజయ్ దక్షిణ తెలంగాణలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా పాల్గొనేందుకు ఈటల ఆసక్తి చూపడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్రలో నిమగ్నమైన తరుణంలో ఈటల రాజేందర్ పార్టీలో సొంతంగా బలం పెంచుకొనే లక్ష్యంతో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
మంగళవారం సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ సమావేశాలకు హాజరయ్యారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. వరుసగా ఇతర జిల్లాల్లోనూ ఇదే రకమైన కార్యక్రమాలతో ముందుకుపోయేలా ఈటల ప్రణాళిక వేసుకున్నట్టు ఆయన వర్గీయులు చెప్తున్నారు. బండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భాగమైన హుజూరాబాద్ నుంచిఈటల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీలో కొత్తగా చేరిన ఈటల రాష్ట్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.
రాష్ట్రస్థాయిలో రాజకీయంగా తనకన్నా జూనియర్లు బీజేపీకి నేతృత్వం వహిస్తున్నారని, దీన్ని అవకాశంగా తీసుకొని సొంత బలం పెంచుకోవాలని ఈటల ప్రణాళికతో ఉన్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒకే జిల్లాకు చెందిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఇప్పటికే అంతరం పెరిగింది. రాష్ట్ర నాయకత్వాన్ని ఖాతరు చేయకుండా ఈటల సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై బండి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఈ కారణాలతో ఇద్దరు నేతల మధ్య ఇప్పటికే దూరం పెరిగింది. బండి పాదయాత్ర సమయంలో ఈటల ఇలా జిల్లాల పర్యటనలు చేస్తుండటంతో ఈ అంతరం ఇంకా పెరుగుతున్నదని బీజేపీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

