ఈటలకు డ్రెస్ లేదు అడ్రస్ లేదు
బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఈటల అతిగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. ఈటల తన గురించి ఎక్కువగా ఊహించుకొంటున్నారని, టీఆర్ఎస్, కేసీఆర్ లేకుంటే ఈటలకు డ్రెస్.. అడ్రస్ లేదని గుర్తు చేశారు
- టీఆర్ఎస్, కేసీఆర్ లేకుంటే..
- అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే రకం
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
- బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారని వెల్లడి
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఈటల అతిగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. ఈటల తన గురించి ఎక్కువగా ఊహించుకొంటున్నారని, టీఆర్ఎస్, కేసీఆర్ లేకుంటే ఈటలకు డ్రెస్.. అడ్రస్ లేదని గుర్తు చేశారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జాజుల సురేందర్, ముఠా గోపాల్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి సుమన్ మాట్లాడుతూ సర్పంచ్ కూడా కానీ ఈటలను రెండు సార్లు మంత్రిగా చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004 కు ముందు ఈటల అడ్రస్ ఎకడని ప్రశ్నించారు.
ఈటల శిఖండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్య, ఆర్థిక మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డారని, పేదల భూములు అక్రమించారని తెలిపారు. హుజూరాబాద్‌లో ఓటమి తప్పదనే.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈటల ఓ చెల్లని రూపాయంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ద్రోహుల తయారీ కర్మాగారాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవులు, రాజకీయాలు తప్ప బీజేపీ, కాంగ్రెస్‌కు వరదల్లో ప్రజల గోస పట్టడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల హుజూరాబాద్‌లో పోటీచేసి రేవంత్ సాయంతో గెలిచారని తెలిపారు. ఈటల నల్లికుట్ల రాజకీయాలు తెలంగాణలో నడవవని, మోదీకి, అమిత్‌షాకు గులాంలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పుకొంటున్న ఈటలకు కనీసం వార్డు మెంబర్ కూడా టచ్‌లో లేరని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్లో చేరికలుంటాయని సుమన్ చెప్పారు.
ఈటలది వ్యాపార నైజం.. గువ్వల
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈటలది వ్యాపార నైజమని, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని మండిపడ్డారు. ఈటల అహంకారంతో బడుగు బలహీన వర్గాల దొరలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఈటల పిట్టల దొరలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎద్దేవా చేశారు. ఈటల పెద్ద బ్రోకర్లా మారాడని, పైకి ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ కాదు.. ఈటల రాజేందర్‌రెడ్డి, ఆధార్ కార్డులో సందర్భాన్ని బట్టి తన పేరును రెడ్డిగా పెట్టుకున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధారాలను బయటపెట్టారు. తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఈటల కుట్ర, రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

