హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 19 : జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించి జాతీయస్థాయిలో విజయపతాకాన్ని మరోసారి ఎగరేసినట్టు విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలోని అన్ని క్యాటగిరీల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన వీ నాగసిద్ధార్థ 5వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు. పాటిల్ సాక్షి 48వ ర్యాంకు, ఎం అరుణ్ 60వ ర్యాంకు, ఎం రవిచంద్రరెడ్డి 65వ ర్యాంకు, వై భరణిశంకర్ 88వ ర్యాంకు, బాదావత్ సురేశ్ 98వ ర్యాంకు సాధించి ఎస్సార్ కీర్తిప్రతిష్ఠను జాతీయస్థాయిలో నిలబెటినట్టు తెలిపారు. మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ -2025 ప్రవేశానికి ఇప్పటివరకు 3,556కి పైగా విద్యార్థులు అర్హత సాధించి రాష్ట్రంలో ఎస్సార్ విజయపతాకాన్ని ఎగురవేశారు.
వీరితోపాటు దాసరి ఫణీంద్ర 116వ ర్యాంకు, మోదెల వెంకటకౌశిక్ 141, ఈ బిందుశ్రీ 142, గుట్ట దిలీప్‌రెడ్డి 190, భూక్యా వినోద్ 246, సీహెచ్ షణ్ముకసాయి 274, బీ ధనషణ్ముకశ్రీ 410, కాగితపు దీపక్ 491, పుత్తూరు ఉజ్వల్ 509వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో అత్యుత్తమమైన మార్కులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించామని, ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.
‘గౌతమ్’ పూర్వ విద్యార్థుల ఘన విజయం
హైదరాబాద్ ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్-2025 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు వివిధ క్యాటగిరీల్లో 100లోపు 9 ర్యాంకులు సాధించినట్టు ప్రిన్సిపల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ హేమంత్ అభిరామ్ ఆలిండియా 18వ ర్యాంకు, వై జశ్వంత్ చౌదరి 22వ ర్యాంకు, ఎల్ చెర్విత 22వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు. అలాగే 100లోపు వివిధ క్యాటగిరీలలో 18,22,22,26,31,34,53,60,74 వంటి 9ర్యాంకులు సాధించడం గర్వంగా ఉన్నదని అన్నారు. ఇంతటి విజయాన్ని సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.