Errabelli Dayaker Rao | వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకుర్తి నియోజకవర్గంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గమంతా కలియతిరుగుతూ.. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.
మహిళలతో బతుకమ్మ ఆడి పాడి కోలాటం వేశారు మంత్రి. రాయపర్తి మండలం కొండూరు, కొలన్పల్లి, పాలకుర్తి మండలం దర్దేపల్లి, దేవరుప్పుల మండలంలోని దేవరుప్పుల సహా పలు గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.