స్థానికులకు సమాన అవకాశాలు.. నూతన జోనల్ విధానం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జోనల్ విధానంలోని అస్తవ్యస్థతను తొలగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జోనల్ విధానాన్ని ప్రకటించడం హర్షణీయం. ఈ విధానం వల్ల తెలంగాణేతరులు మన రాష్ట్రంలోని ఉద్యోగాలలో చేరకుండా నిలువరించినట్టవుతున్నది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు ‘సామాజిక న్యాయం’తో పాటు సమన్యాయం/ సమానవ అవకాశాలు చేకూర్చడం సాధ్యమవుతున్నది.
రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 30ననే నూతన జోనల్ విధాన మార్గదర్శకాలను వెలువరించినది. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలనే విజ్ఞప్తులు వచ్చాయి. ములుగు, నారాయణపేట జిల్లాలు కొత్తగా ఏర్పడినాయి. దీంతో సవరణలతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం 2018లోనే కేంద్రం ఆమోదానికి పంపింది. 2021ఏప్రిల్‌లో ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా కొత్త జోన్లు, మల్టీజోన్లతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30న వెలువరించింది. 33 జిల్లాలు, 7 జోన్లు 2 మల్టీజోన్లలో జరిగే నియామకాలలో, పదోన్నతులలో కొత్త జోనల్ విధానం అమలు చేయాలని 2021 జూలై 22న ఆదేశాలు జారీచేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులను యథేచ్ఛ ఉల్లంఘించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్లోని అన్ రిజర్వ్డ్ 20 శాతం,30 శాతం, 40 శాతం పోస్టుల నియామకాలలో నాన్ లోకల్‌ను నియమించారు. ఇలాంటి అస్తవ్యస్థ విధానానికి తెరదించే ఉత్తర్వులను రూపొందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనీయులు. ఈ ఉత్తర్వుల వల్ల మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి సమానవకాశాలు కల్పించడంతో పాటు, సామాజిక న్యాయం సైతం పాటించడం సాధ్యమవుతున్నది. తెలంగాణేతరులు మన ఉద్యోగాలలో చేరకుండా నిలువరించినట్టవుతున్నది.
కొత్త జోనల్ విధానంలోని ముఖ్యాంశాలు: జిల్లా: అనగా రెవెన్యూ జిల్లా 33 జిల్లాలు
(పోలీస్ శాఖను మినహాయించి) పోలీస్ జిల్లా లేదా పోలీస్ కమిషనరేట్ (పోలీస్ శాఖకు సంబంధించి)
1.జీవో 124 (30.08.2018) ఉత్తర్వులోని పేరా 3 (1) ప్రకారం ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి అంటే, 30.08.2018 నాటి నుంచి 36 నెలలలోగా అంటే 30.08. 2021లోగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలలోని వివిధ పోస్టులను వివిధ లోకల్ క్యాడర్‌గా ఆర్గనైజ్ చేయాలి. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 4, నాడు దాదాపు అన్ని శాఖలలోని వివిధ పోస్టులను వివిధ లోకల్ క్యాడర్‌గా (జిల్లా, జోనల్, మల్టీ జోనల్)గా ఆర్గనైజ్ చేయడమైనది.
2.ప్రతి జిల్లాలోని జూనియర్ అసిస్టెంట్ కేటగిరి, సమానమైన ఇతర కేటగిరిలు లేదా జూనియర్ అసిస్టెంట్‌కు తక్కువస్థాయి కేటగిరి/ పోస్టులను ప్రత్యేక కేడర్‌గా నిర్ధారించారు. ఇందుకు గాను జూనియర్ అసిస్టెంట్ కనీస స్కేల్ ఆఫ్ పేను (24280) ప్రామాణికంగా తీసుకున్నారు. స్థానిక ప్రాంతం: ఈ లోకల్ కేడర్ పోస్టులకు స్థానిక ప్రాంతంగా ‘జిల్లా’ను నిర్ధారించారు.
3.మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలోని నాన్ గెజిటెడ్ కేటగిరికి సంబంధించిన ఉపాధ్యాయులను, సమానమైన సారూప్యత గల పోస్టులను ప్రత్యేక క్యాడర్‌గా నిర్ధారించడమైనది.
ఈ లోకల్ క్యాడర్ పోస్టులకు లోకల్ ఏరియాగా జిల్లాను నిర్ధారించారు.
4.ప్రతి జోన్‌లోని జూనియర్ అసిస్టెంట్ కేటగిరి కన్నా పైస్థాయి పోస్టుల నుంచి సూపరిండెంటెంట్ కేటగిరి వరకు (సూపరిండెంటెంట్ పోస్టును కలుపుకొని), ఇతర శాఖలలోని ఇతర సమాన కేటగిరిలను ప్రత్యేక క్యాడర్‌గా నిర్ధారించడం జరిగింది.
సమానమైన కేటగిరిలను నిర్ధారించుకొని సూపరిండెంటెంట్ కనీస స్కేల్ ఆఫ్ పేను (42300) ప్రామాణికంగా నిర్ధారించడం జరిగింది. లోకల్ ఏరియా: ఈ లోకల్ కాడర్ పోస్టులకు స్థానిక ప్రాంతంగా జోన్‌ను నిర్ధారించారు.
- ప్రతి మల్టీజోన్‌లోని సూపరిండెంటెంట్ కేటగిరి కన్నా పైస్థాయి పోస్టుల నుంచి డిప్యూటీ కలెక్టర్ పోస్టు వరకు (డిప్యూటీ కలెక్టర్ పోస్టు కలుపుకొని) ఇతర శాఖలలోని సమాన కేటగిరిలను ప్రత్యేక క్యాడర్‌గా నిర్ధారించడం జరిగింది. ఇందుకుగాను డిప్యూటీ కలెక్టర్ కనీస స్కేల్ ఆఫ్ పే (58,850)ను ప్రామాణికంగా నిర్ధారించడం జరిగింది.
లోకల్ ఏరియా: ఈ లోకల్ క్యాడర్ పోస్ట్‌లకు లోకల్ ఏరియాగా మల్టీజోన్కు నిర్ధారించారు.
అయితే ఈ జిల్లా జోన్, మల్టీజోన్ క్యాడర్లతో సంబంధం లేకుండా ఏ పోస్టునైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమని భావిస్తే రెండు లేదా, అంతకన్నా ఎక్కువ సామీప్య జిల్లాలతో లేదా జోన్లతో ప్రత్యేక క్యాడర్‌గా నిర్ధారించవచ్చు. - అయితే సామీప్య జిల్లాలు లేదా సామీప్య జోన్లు కలిపి ప్రత్యేక లోకల్ క్యాడర్‌గా నిర్ధారిస్తే ఆయా జిల్లాలు, జోన్లు ప్రత్యేక లోకల్ ఏరియాగా నిర్ధారిస్తారు.
స్థానిక రిజర్వేషన్లు: జిల్లా కేడర్ పోస్టులలో 95 శాతం ఆయా జిల్లాల స్థానిక అభ్యర్థులకు జోనల్ కేడర్ పోస్టులలో 95 శాతం ఆయా జోన్ల స్థానిక అభ్యర్థులకు మల్టీ జోనల్ కేడర్ పోస్టులలో 95 శాతం ఆయా మల్టీ జోనల్ స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు కేటాయిస్తారు. - అయితే సామీప్య జిల్లా కేడర్, సామీప్య జోనల్ కేడర్‌గా ఆయా పోస్టులను నిర్ధారిస్తే 95 శాతం పోస్టులను ఆయా లోకల్ ఏరియా జనాభా నిష్పత్తి ఆధారంగా ఆయా స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు.
- లోకల్ క్యాండిడేట్ (స్థానిక అభ్యర్థి) నిర్ధారణ: ఆయా స్థానిక ప్రాంతాలలో (జిల్లా, జోన్, మల్టీ జోన్) స్థానిక అభ్యర్థిగా 4 వరుస సంవత్సరాలకు తక్కువగా కాకుండా చివరి 7వ తరగతి వరకు (ఉదా: 4, 5, 6, 7 తరగతులు) ఒకే ప్రాంతంలో చదివి ఉంటే ఆ ప్రాంతం ఆ అభ్యర్థికి లోకల్ ఏరియా అవుతుంది.
- తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వరుసగా 7 సంవత్సరాలు, 7వ తరగతి వరకు చదివి ఉంటే –
ఎ. ఆ ఏడేండ్లలో గరిష్ఠకాలం ఏ ప్రాంతంలో చదివి ఉంటే ఆ ప్రాంతం అభ్యర్థికి లోకల్ ఏరియాగా పరిగణింపబడుతుంది.
లేదా..
బి). రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాన ప్రాంతాల్లో చదివి ఉంటే అనగా.. ఉదాః
1, 2వ తరగతి- ఒక జిల్లా
3వ తరగతి- ఒక జిల్లా
4, 5వ తరగతులు- ఒక జిల్లా
6, 7 తరగతులు- ఒక జిల్లా
చివరి సమాన కాలాన్ని ఆ వ్యక్తి లోకల్ ఏరియాగా (6, 7వ తరగతులు చదివిన ప్రాంతాన్ని) పరిగణిస్తారు. - ఆయా జిల్లా జోనల్, మల్టీ జోనల్ స్థానిక అభ్యర్థులకు 95 శాతం కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 5 శాతం అన్రిజర్వ్డ్ అనగా ఆ 5 శాతం పోస్టులలో స్థానిక, స్థానికేతర అభ్యర్థులు పోటీపడవచ్చు.
- అయితే రోస్టర్ పాయింట్ల ప్రకారం (సామాజిక న్యాయం ప్రకారం) ఆయా నియామకాలు జరుగుతాయి.
14.జీవో 124 ఉత్తర్వులోని పేరా 3(1) ప్రకారం 2021ఆగస్టు 4న దాదాపు అన్ని శాఖలలోని అన్ని కేటగిరి పోస్టులను ఆయా లోకల్ క్యాడర్లుగా నిర్ధారించడం జరిగింది.
15.ఆ ఉత్తర్వుల ఆధారంగా డైరెక్టు రిక్రూట్మెంట్కు సంబంధించి గ్రూప్-1 పోస్టులన్నీ మల్టీ జోన్ పోస్టులుగా నిర్ధారించారు.
మల్టీజోన్ కేటగిరిలోకి వచ్చే మరికొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు –
అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
జూనియర్ లెక్చరర్స్
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ (III)
పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్
ఆఫీసర్ (పీ.ఆర్, ఆర్.డి.)
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్
అసిస్టెంట్ రిజిష్టార్ కో-ఆపరేటివ్
అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్
ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్
- జోనల్ కేటగిరీకి వచ్చే పోస్టులు
1.ఎ.సి.టి.ఓ.
2.నాయబ్ తహశీల్దార్ - సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ – 2
4.అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
5.అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్.
6.ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గ్రేడ్-1 ఇన్ ఎండోమెంట్
7.సబ్ ఇన్స్పెక్టర్
8.జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్
9.హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-2) - ఎక్సైజ్ శాఖలోని ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఆఫ్ పే తో సమానంగా ఉన్నా, జీవో 124 ఉత్తర్వులోని పేరా 3 (6) ప్రకారం సామీప్య జిల్లా క్యాడర్‌గా నిర్ధారించారు. ఎక్సైజ్ ఎస్.ఐ. పోస్టు స్కేల్ ఆఫ్ పే ప్రకారం జోనల్ పోస్టుగా నిర్ధారించాల్సి ఉన్నా, జీవో 124 ఉత్తర్వు పేరా 3 (6) ప్రకారం సామీప్య జిల్లా క్యాడర్ గా నిర్ధారించారు.
18.ఆయా స్థానిక క్యాడర్లకు ఉద్యోగుల కేటాయింపు: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలోని, వివిధ క్యాటగిరి పోస్టులలోని వ్యక్తులను ఆయా లోకల్ కేడర్‌లోకి కేటాయింపుల కోసం కమిటీలను ఏర్పరచాలి. ఆ కమిటీల సలహాలు, సూచనల ఆధారంగా కేటాయింపులు చేయాలి. - రాష్ట్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధిత అధికారిగాని ఉద్యోగులను, ఆయా లోకల్ క్యాడర్‌లోకి కేటాయించేటప్పుడు ఈ కింది విషయాలన్నింటినిగాని, కొన్నింటిని గాని పరిగణనలోకి తీసుకోవాలి.
- పాలనా అవసరాలు
- వయస్సు, సీనియారిటీ ఆధారంగా సమతుల్య లోకల్ క్యాడర్ కూర్పు ఆవశ్యకత
- వ్యక్తుల లెంత్ ఆఫ్ సర్విస్
- వ్యక్తుల ప్రాధాన్యానికి అనుగుణంగా లోకల్ కేడర్ కేటాయింపు
20.ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉన్నది. - జివో 124 పేరా 4 (7)లోని విశేష ప్రతిపత్తిని అనుసరించి పాత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నియమించబడిన వారిని యథాస్థానంలో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉన్నది.
- ఇతర అంశాలు: జిల్లా, జోన్, మల్టీ జోన్‌ను నియామకాలలో పదోన్నతులలో ప్రత్యేక యూనిట్‌గా పరిగణిస్తారు.
- ఈ ఉత్తర్వులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది విషయాలలో నిబంధనలు రూపొందించవచ్చు.
ఎ. అన్ని లోకల్ క్యేడర్లలోని వ్యక్తులకు పదోన్నతులలో సమాన అవకాశాలు కల్పించవచ్చు.
బి. ఒక లోకల్ క్యాడర్ నుంచి (జిల్లా, జోన్, మల్టీ జోన్) స్థానిక రిజర్వేషన్లు అమలుకాని కార్యాలయాలలోకి (ఉదా: సచివాలయ, శాఖాధిపతుల కార్యాలయాలలో) బదిలీ నియామకాల ద్వారా (అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్) బదిలీలు చేయవచ్చు.
సి. ఒక లోకల్ క్యాడర్ నుంచి మరొక లోకల్ క్యాడర్‌కు వ్యక్తులను బదిలీ చేయవచ్చు. అయితే ఆ వ్యక్తి సీనియారిటీ ఆ లోకల్ క్యాడర్‌కు బదిలీ అయిన తేదీ నుంచి పరిగణింపబడుతుంది. - జీవో 124 ఉత్తర్వు పేరా 13 ప్రకారం ఈ ఉత్తర్వులు వచి ్చన నుంచి లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ అయిన వరకు జరిగిన ని యామకాలను, పదోన్నతులను ఈ ఉత్తర్వులకు అనుగుణంగా సమీక్షించి సర్దుబాటు చేస్తారు.
- జీవో 124 ఉత్తర్వు పేరా 14 ప్రకారం స్థానిక రిజర్వేషన్లు కింది పోస్టులకు వర్తించవు.
- సచివాలయానికి సంబంధించిన పోస్టులు
- శాఖాధిపతి కార్యాలయంలోని పోస్టులు
- ప్రత్యేక ఆఫీసు లేదా ఎస్టాబ్లిష్మెంట్ పోస్టులు.
- రాష్ట్రస్థాయి కార్యాలయానికి సంబంధించిన పోస్టులు.
- సూచనలు:
- సచివాలయం, శాఖాధిపతి కార్యాలయంలోని (హెచ్‌వోడీ) పోస్టులలో స్థానిక రిజర్వేషన్లు అమలుకాకపోవడం వల్ల తెలంగాణేతరులు ఎంపిక కాబడే అవకాశం ఉంది. కావున. జీవో 124 పేరా 5 (2) (బి) ప్రకారం ఆయా లోకల్ క్యాడర్లోని సమా న కేటగిరి గల ఉద్యోగులను నిష్పత్తి ప్రాతినిధ్యంతో బదిలీ నియామకాల ద్వారా (అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్) నియమిస్తే తెలంగాణ రాష్ట్ర అధికార కేంద్రమైన సచివాలయంలో తెలంగాణేతరులను నిలువరించడంతోపాటు తెలంగాణ స్థానికత కలవారిని నియమించడానికి అవకాశం ఉంటుంది.
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంపిక ఆయా లోకల్ క్యాడర్లలో చేసి కేటాయింపులు (అలాట్మెంట్) రాష్ట్రస్థాయిలో చేయడం ద్వారా ఆయా అభ్యర్థులకు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగం చేసే అవకాశం కల్పించినట్లవుతుంది.
- ఈ ఉత్తర్వుల అమలులోని అవాంతరాలు, ఇబ్బందులు అధిగమించడానికి ఉద్యోగులు, నిరుద్యోగులు ఎప్పటికప్పుడు సంప్రదించే విధంగా ‘ఆఫీసర్స్ కమిటీ’ (ఉద్యోగుల కేటాయింపునకు ఏర్పడే కమిటీలు కాకుండా) ఏర్పర్చాలి.
- ఉద్యోగుల కేటాయింపు సర్దుబాటు త్వరగా పూర్తిచేసి ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలి.
- నిరుద్యోగులకు కనీసం పదేండ్ల వయో పరిమితి సడలింపు ఇవ్వాలి.
అన్ని శాఖలలోని పోస్టులకు సంబంధించి
(పోలీసు శాఖ మినహాయించి)
జోన్ల వివరాలు
జోన్-I – కాళేశ్వరం జోన్
ఆసిఫాబాద్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
జోన్-II- బాసర జోన్
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
జోన్- III- రాజన్న జోన్
కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్ధిపేట,
మెదక్, కామారెడ్డి జిల్లాలు
జోన్- IV – భద్రాద్రి జోన్
కొత్తగూడెం-భద్రాద్రి; ఖమ్మం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ
జోన్-V- యాదాద్రి జోన్
సూర్యాపేట, నల్గొండ, బోనగరి, యాదాద్రి, జనగాం జిల్లాలు
జోన్ -VI – చార్మినార్ జోన్
మేడ్చల్- మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
జోన్ -VII – జోగులాంబ జోన్
మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల,
వనపర్తి, నాగర్ కర్నూల్ జిలాలు.
పోలీసు శాఖకు సంబంధించి..
జోన్-I- కాళేశ్వరం జోన్- ఆసిఫాబాద్-కొమురంభీం, భూపా లపల్లి-జయశంకర్, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు
జోన్-II- బాసర జోన్
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్
జోన్-III- రాజన్న జోన్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్ జిల్లాలు.
జోన్-IV- కొత్తగూడెం- భద్రాద్రి, భద్రాద్రి జోన్; ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్
జోన్-V- యాదాద్రి జోన్; సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్
జోన్-VI- చార్మినార్ జోన్; హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్
జోన్-VII- జోగులాంబ జోన్: మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల-జోగులాంబ, నాగర్‌కర్నూల్ జిల్లాలు
మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
అధ్యక్షులు, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

