మండలి ప్రాంగణంలో పర్యావరణానికి ప్రాధాన్యం: సీఎస్
రాష్ట్ర శాసన మండలి ప్రాంగణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు మంగళవారం సందర్శించారు. మండలిలో ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలపై హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలసి పరిశీలించారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసన మండలి ప్రాంగణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు మంగళవారం సందర్శించారు. మండలిలో ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలపై హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలాతో కలసి పరిశీలించారు. శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ స్పీకర్‌తోపాటు శాసనసభ కార్యదర్శి, శాసన మండలి కార్యదర్శుల నివాస భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల వివరాలు తెలుసుకున్నారు.
అలాగే, శాసనసభ ప్రాంగణానికి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, అనుబంధ భవనం ఏర్పాటు, ఇతర అనుబంధ సౌకర్యాల అభివృద్ధి అంశాలు కూడా తెలుసుకున్నారు. అనుబంధ భవనం, పరిపాలనా భవనం, శాసనసభాపక్ష కార్యాలయాలు, విశ్రాంతి భవనం, క్రీడా మైదానం, పారింగ్ సౌకర్యాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఈ ప్రాజెక్టులో పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధి విధానాలు అనుసరించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేసినట్టు సీఎస్ పేరొన్నారు. ఇప్పటికే ఉన్న పచ్చదనానికి ఎలాంటి విఘాతం కలగకుండా, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

