ఇంజినీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త.. కొత్తగా 1,663 పోస్టుల భర్తీకి అనుమతులు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ , తాజాగా మరో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.
ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది సువర్ణావకాశం. ఇరిగేషన్, ఆర్ డ్ం బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్ ఇచ్చింది. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్) లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ఆర్ అండ్ బి, ఎన్. హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్ యూబీ ఎస్, హెచ్ వోడీ) లో284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.
వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వ ర్క్స్ అక్కౌంట్స్ హెచ్వోడీలో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ (హెచ్‌వోడీ) లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది.
మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

