ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై ఎవరి ఒత్తిడీ లేదు

- మూడేండ్ల క్రితమే మార్పు
- అదీ కేంద్రం సూచనలతోనే
- అభివృద్ధి పనులు జరిగిన చోట కొంత మార్పు ఉండవచ్చు
- ఈఎన్సీ గణపతిరెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మూడేండ్ల క్రితం మార్పులు చేశామని రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్‌చీఫ్ గణపతిరెడ్డి శనివారం పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం.. పట్టణాలు, గ్రామాలు, చెరువులు, కుంటలు, గుట్టలు తగులకుండా పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ రూపొందించాలని సూచించినట్టు గణపతిరెడ్డి వెల్లడించారు.
కేంద్రం సూచనల మేరకు మూడేండ్ల క్రితమే గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను రూపొందించామన్నారు. దీని ప్రకారం 340 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్‌రోడ్డును మంజూరుచేయాలని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు. నీరు, విద్యుత్తు వినియోగాలు, నివాసాలు, పరిశ్రమలు, వ్యాపార స్థాపనలు మొదలైనవాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. వాటిని తొలగించడానికి అవకాశం లేకుండా రూపొందించిన గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను.. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలు సమీక్షించిన తర్వాతే కేంద్రం ఆమోదించిందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్‌ను ప్రతిపాదించినప్పటి నుంచి కేంద్రం 2021 మార్చిలో ఉత్తర భాగానికి ఆమోదం తెలిపేందుకు మూడేండ్లు పట్టిందని, ఈ మూడేండ్లలో మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ పరిధిలో ఇరిగేషన్ కాలువలు, రింగ్ రోడ్లు, జలాశయాలు మొదలైనవి ఏర్పడ్డాయని ఈఎన్సీ వివరించారు.
వీటిని పరిరక్షించడానికి అవసరమైతే కొన్ని మార్పులు చేస్తామని తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వే నిబంధనల ప్రకారం రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారైనందున.. వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడం కుదరదని స్పష్టం చేశారు. భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 50% భరిస్తుందని చెప్పారు. భూ సేకరణలో భారత ప్రభుత్వానికి సహాయం చేయాల్సిన బాధ్యత రాష్ర్టానికి ఉన్నందున అలైన్మెంట్ ఫైనలైజేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జోక్యాన్ని సహించదన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు అలైన్మెంట్ మార్పుకోసం ఒత్తిడి తెస్తున్నారనడం పూర్తిగా నిరాధారమని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ENC
- Ganapathy Reddy
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

