జిల్లాల ఏర్పాటుతో పెరిగిన ఉపాధి అవకాశాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
నూతన జిల్లాల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
వనపర్తి : నూతన జిల్లాల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో రూ.2.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారికి, నాగవరం తండా సమీపంలో రూ.25 లక్షలతో 29 గుంటలలో నిర్మించబోయే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం భౌగోళికంగా నలువైపులా వేగంగా విస్తరిస్తుందని వివిధ రకాల ద్విచక్ర వాహనాలు, కార్ల షోరూంలు, మార్కెట్లు, మాల్స్ ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.దానికి అనుగుణంగా మౌళిక సదుపాయాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఏడాదిన్నరలోపు వనపర్తి సమీపంలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు.
సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలయం నిర్మించారని, స్థానికంగా ఆలయాల నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. ఈ నెల 12 తర్వాత వనపర్తిలోని ప్రతి రోజూ రెండు వార్డుల చొప్పున పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని వివరించారు.అంతర్గత రహదారులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు. అంతకు ముందు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

