పాపన్నపేట, ఫిబ్రవరి 16: ఎప్పుడో కూలిపోయిన ఇంటికి రూ.రెండు లక్షల బిల్లు చెల్లించాలంటూ విద్యుత్తు అధికారులు నోటీసులిచ్చిన ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జంబికుంటలో చోటుచేసుకున్నది. ఈ మేరకు బాధితుడు శ్రీనివాస్ శుక్రవారం పాపన్నపేటలో నిర్వహించిన వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. పాపన్నపేటలో టేక్మాల్, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, పాపన్నపేట మండలాల పరిధిలోని విద్యుత్తు వినియోగదారుల కోసం సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో పెద్దశంకరంపేటలోని జంబికుంటకు చెందిన వినియోగదారుడు మాట్లాడుతూ తన ఇల్లు కూలిపోయి ఏండ్లు గడుస్తున్నా అధికారులు రూ.రెండు లక్షల బిల్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారని ఫిర్యాదు అందజేశాడు. 80 యూనిట్ల విద్యుత్తు వినియోగదారుడికి రూ.8,467 బిల్లు ఇచ్చా రని అల్లాదుర్గం మండలం ముస్లాపూర్కు చెందిన అంజయ్య ఫోరం అధికారుల దృష్టికి తెచ్చాడు. ఆయా మండలాల నుంచి 74 ఫిర్యాదులు వచ్చా యని, వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని ఫోరం అధికారులు తెలిపారు.