Telangana | స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక
తెలంగాణ శాసనసభ స్పీకర్ (Speaker) ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14న ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ (Speaker) ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14న ఉదయం 10.30 గంటలకు సభాపతి ఎన్నికను నిర్వహించనున్నారు. స్పీకర్ పదవికి పోటీపడే వారి నుంచి ఈ నెల 13న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈమేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా, కొత్తగా శాసనసభ శనివారం కొలువుదీరిన విషయం తెలిసిందే. నూతన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే ఒక్కరే నామినేషన్ రావాల్సి ఉంటుంది. ఇతర సభ్యులు ఎవరైనా పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీకర్ ఎన్నిక ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో జరుగనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

